హరీశ్‌రావు వ్యాఖ్యలు రాష్ట్ర దుస్థితికి నిదర్శనం

తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఏపీలో ఉపాధ్యాయుల పరిస్థితిని ఎత్తి చూపడం మన రాష్ట్ర దుస్థితికి అద్దం పడుతోందని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు పేర్కొన్నారు.

Published : 01 Oct 2022 05:06 IST

తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఏపీలో ఉపాధ్యాయుల పరిస్థితిని ఎత్తి చూపడం మన రాష్ట్ర దుస్థితికి అద్దం పడుతోందని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం విద్యాబోధన కంటే మద్యం విక్రయాలు, మరుగుదొడ్ల శుభ్రత పైనే దృష్టి పెడుతోందని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఉపాధ్యాయులకు బోధన పని కన్నా అనవసరమైన బాధ్యతలు ఎక్కువయ్యాయి. బొత్స సత్యనారాయణ అన్నమేరకు హరీశ్‌రావు వచ్చి ఏపీలో పరిశీలిస్తే మన పరువేపోతుంది. సీఎం ఇంటిని ముట్టడిస్తామంటే కేసులు పెట్టమా? అని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి చూస్తే ఉపాధ్యాయుల మీద కక్షపూరితంగానే కేసులు పెట్టినట్లు స్పష్టమవుతోంది. జీతాలు లేవని మున్సిపల్‌ ఉపాధ్యాయులు మొత్తుకుంటున్నారు. రాష్ట్రంలో మొత్తం విద్యావ్యవస్థే అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వోద్యోగుల పరిస్థితీ ఇబ్బందికరంగానే ఉంది’’ అని అశోక్‌బాబు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని