కేసీఆర్‌ జాతీయపార్టీకి రంగం సిద్ధం

జాతీయ పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో భాగంగా ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో మంత్రులు, 33 జిల్లాల పార్టీ అధ్యక్షులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

Updated : 02 Oct 2022 11:10 IST

నేడు మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులతో కీలక భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో భాగంగా ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో మంత్రులు, 33 జిల్లాల పార్టీ అధ్యక్షులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. దసరా రోజున జాతీయపార్టీ ప్రకటనకు సన్నాహకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం మంత్రులు, జిల్లా అధ్యక్షులకు శనివారం రాత్రి పార్టీ కార్యాలయం నుంచి ఫోన్‌ ద్వారా ఆహ్వానాలు అందాయి. జాతీయ రాజకీయాల దృష్టితో.. కేసీఆర్‌ ఇంతకుముందే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర పార్టీల నేతలతో చర్చించారు. ఆర్థికవేత్తలు, సామాజికవేత్తలు, రైతునేతలతో సమాలోచనలు చేశారు. కొత్త పార్టీ ఏర్పాటుకు దసరాను ముహూర్తంగా నిర్ణయించారు. ఆ రోజు తెలంగాణభవన్‌లో పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించి, ప్రకటన చేసే అవకాశం ఉంది. సీఎం శనివారం వరంగల్‌ జిల్లా పర్యటన సందర్భంగా జరిగిన సభలో జై తెలంగాణ,  జై భారత్‌ అన్న నినాదాలతో జాతీయపార్టీపై సంకేతాలిచ్చారు. దసరా లోపు ఆయన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోనూ సమావేశమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని