కలసికట్టుగా పార్టీని ముందుకు తీసుకురావాలి

మధ్యప్రదేశ్‌లో భారత్‌ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు శనివారం కలిశారు.

Published : 04 Dec 2022 04:46 IST

పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజుకు రాహుల్‌గాంధీ సూచన

ఈనాడు, అమరావతి: మధ్యప్రదేశ్‌లో భారత్‌ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు శనివారం కలిశారు. పీసీసీ అధ్యక్షుడిగా తనను ఎంపిక చేసినందుకు రుద్రరాజు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని కలసికట్టుగా ముందుకు తీసుకురావాలని ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడికి రాహుల్‌గాంధీ సూచించారని విజయవాడలోని ఆంధ్రరత్న భవనం ఒక ప్రకటనలో తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు