సర్వేలన్నీ తెరాసకే అనుకూలం

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో యువ సత్తా చాటి, గులాబీ జెండాను ఎగురవేయాలని అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. నియోజకవర్గంలో సర్వేలన్నీ తెరాసకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి- సంక్షేమ పథకాల వ్యతిరేకులకు

Published : 14 Aug 2021 04:41 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉపఎన్నికలో యువ సత్తా చాటి, గులాబీ జెండాను ఎగురవేయాలని అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. నియోజకవర్గంలో సర్వేలన్నీ తెరాసకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి- సంక్షేమ పథకాల వ్యతిరేకులకు తగిన శాస్తి జరుగుతుందని వ్యాఖ్యానించారు. శ్రీనివాస్‌యాదవ్‌ శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిసి, తనకు టికెట్‌ కేటాయింపుపై కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఉపఎన్నిక తెరాసపై ప్రజాభిమానాన్ని తెలియజెప్పడానికి వచ్చిన అవకాశమని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యమకారుడు, విద్యార్థి నాయకుడు, బీసీ సామాజికవర్గానికి చెందిన గెల్లు అభ్యర్థిత్వంపై అన్నివర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోందని వ్యాఖ్యానించారు. సీఎం నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పార్టీ ప్రతిష్ఠను మరింత పెంచుతానని, ప్రజాసేవకు అంకితమవుతానని గెల్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు