Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 07 May 2024 16:59 IST

1. ‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ

తాను ఇస్లాంను, ముస్లింలను వ్యతిరేకించనని ప్రధాని మోదీ (Modi) వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల సమరం వాడీవేడిగా జరుగుతోన్న తరుణంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన ఈవిధంగా స్పందించారు. అది మా విధానం కాదు. నెహ్రూ కాలం నుంచే వారు (విపక్షాలను ఉద్దేశించి) ఈ కథనాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల సంవత్సరం..!

మానవ చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల సంవత్సరంగా 2024 నిలవనుంది. ఈసారి చాలాచోట్ల ప్రాంతీయ, జాతీయ ఎన్నికలను జనాలు చూడనున్నారు. అంతేకాదు.. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న పది దేశాల్లో ఏడుచోట్ల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో చాలా విశేషాలున్నాయి. మొత్తం 64 దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవ్‌: సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనా

ప్రభుత్వం ఇచ్చే పథకాలేవీ ఆపాలని ఎన్నికల సంఘం ఆదేశాలివ్వలేదని, కొంతకాలం తర్వాత ఇవ్వాలని చెప్పిందని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనా స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4.  తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు

తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ తర్వాతే నిధులను విడుదల చేయాలని  ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రైతు భరోసా చెల్లింపుల విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్‌.వేణు కుమార్‌ ఈసీకి ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. మీ ఓటు ఏం చేయగలదో తెలుసా..: ప్రధాని మోదీ

ప్రజల ఓటే భారత్‌ను ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టిందని, ప్రపంచంలో దేశ పరపతి పెంచిందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఆయన మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనేలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజా నిర్ణయంతోనే ఆదివాసి కుమార్తె రాష్ట్రపతి అయ్యారని, మహిళలకు రిజర్వేషన్లు లభించాయని, అవినీతిపరులు జైళ్లకు పోతున్నారని, ఉచిత రేషన్‌ వస్తోందన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. గుజరాత్‌లోని మినీ ఆఫ్రికా గ్రామంలో ఉత్సాహంగా పోలింగ్‌..!

గుజరాత్‌(Gujarat)లో పోలింగ్‌ ఉత్సాహంగా జరుగుతోంది. దేశంలో అత్యంత అరుదుగా ఉన్న మినీ-ఆఫ్రికా గ్రామంలో కూడా పోలింగ్‌ హడావుడి కనిపిస్తోంది. జునాఘడ్‌ ఎంపీ నియోజకవర్గ పరిధిలో ఉండే జంబుర్‌ (Jambur)లో ఆఫ్రికాలోని సిద్దీ తెగకు చెందిన ఐదు వేల మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. వీరి తాతలు ఆఫ్రికా ఖండం నుంచి భారత్‌కు వలస వచ్చారు. వారి సంతానమే ఇప్పటికీ ఇక్కడ జీవిస్తోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే పదవులు: కేసీ వేణుగోపాల్‌

 ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే పదవులు ఉంటాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. పార్టీ నేతలతో దిల్లీ నుంచి కాన్ఫరెన్స్‌లో కేసీ వేణుగోపాల్‌ మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. ప్రజల నమ్మకాన్ని కోల్పోతే.. ఇంకేం మిగలదు: దీదీ సర్కారుకు సుప్రీం చురక

పశ్చిమ బెంగాల్‌ (West Bengal) రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం (Teachers recruitment Scam) వ్యవహారంపై సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా బెంగాల్‌ ప్రభుత్వానికి కఠిన ప్రశ్నలు సంధించింది. ఎంపిక ప్రక్రియ అంశం కోర్టులో ఉండగానే కొత్త పోస్టులు సృష్టించి నియామకాలు ఎలా చేపట్టారని ప్రశ్నించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. మొన్న పూరీ.. నేడు చండీగఢ్‌.. నిధులు లేవని టికెట్లను వెనక్కి ఇచ్చేస్తున్న నేతలు

సార్వత్రిక ఎన్నికల వేళ.. పోలింగ్‌కు ముందే పలు పార్టీలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. నిధుల కొరత కారణంగా పలువురు అభ్యర్థులు వెనక్కి తగ్గుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. డబ్బులు లేవని, పార్టీ నుంచి సరైన మద్దతు లభించడం లేదని పార్టీలను వీడుతున్నారు. మొన్న కాంగ్రెస్‌కు ఓ అభ్యర్థి ఇలాంటి షాకే ఇవ్వగా.. తాజాగా శిరోమణి అకాలీదళ్‌ ఆ జాబితాలో చేరింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం.. కరీంనగర్‌లో కూలిన టెంట్లు

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పలు చోట్ల ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. మానుకొండూర్‌, హుజూరాబాద్‌, పెద్దపల్లి, మల్యాల, పెగడపల్లి, వేములవాడలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనాల్సిన కాంగ్రెస్‌ జనజాతర సభకోసం కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన టెంట్లు కుప్పకూలాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని