గ్రూప్‌ సర్వీసు ఉద్యోగ ప్రకటనలు వెలువరించాలి

రాష్ట్రంలో గ్రూప్‌-1, 2, 3, 4 ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లోగా ఉద్యోగ ప్రకటనలు వెలువరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ

Published : 21 Jan 2022 04:52 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రూప్‌-1, 2, 3, 4 ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లోగా ఉద్యోగ ప్రకటనలు వెలువరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతతో కలిసి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. దాదాపు 1600 గ్రూప్‌-1 ఉద్యోగ ఖాళీలున్నా పదేళ్లుగా ఒక్క నోటిఫికేషన్‌ కూడా వెలువడలేదన్నారు. గ్రూప్‌-1 ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో ఐఏఎస్‌ అధికారులపై తీవ్ర పని ఒత్తిడి నెలకొందని, ఒక్కో ఐఏఎస్‌ అధికారి రెండు, మూడు పోస్టులకు ఇన్‌ఛార్జిగా వ్యవహరించాల్సి వస్తోందన్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తి- సిద్దిపేట రోడ్డు విస్తరణ పనులకు నిధులు మంజూరు చేసినందుకుగాను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి గడ్కరీకి సంజయ్‌ ధన్యవాదాలు తెలిపారు.

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి...: భాజపా కిసాన్‌ మోర్చా

వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని భాజపా కిసాన్‌ మోర్చా డిమాండ్‌ చేసింది. మిర్చి రైతులకు ఎకరాకు రూ.40 వేలు, పత్తి, వరి, మొక్కజొన్న రైతులకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరింది. కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ హనుమంత్‌కు వినతిపత్రం అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని