కేసీఆర్‌ను పొగిడితే తప్పేమీ కాదు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

శాసనసభలో సీఎం కేసీఆర్‌ను సంగారెడ్డికి వైద్య కళాశాల కావాలని కోరడంతో మంజూరు చేశారని, అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి అన్నారు. కళాశాల కోసం మూడేళ్ల పాటు ఉద్యమం చేసినట్లు చెప్పారు.

Published : 19 May 2022 05:03 IST

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: శాసనసభలో సీఎం కేసీఆర్‌ను సంగారెడ్డికి వైద్య కళాశాల కావాలని కోరడంతో మంజూరు చేశారని, అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి అన్నారు. కళాశాల కోసం మూడేళ్ల పాటు ఉద్యమం చేసినట్లు చెప్పారు. బుధవారం సంగారెడ్డిలో కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గాంధీ, ఉస్మానియాకు దీటుగా ఈ కాలేజీ ఉంటుందని, సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుతాయని వివరించారు. సీఎం చొరవతోనే ఇది సాధ్యమైందని.. అందువల్ల ఆయనను పొగడటం తప్పేమీ కాదంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కాలేజీ, ఆసుపత్రి ఒకే చోట ఉంటాయని స్పష్టం చేశారు. ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్‌ ప్రవేశాలు వచ్చే ఆగస్టు నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో...ఆ లోపుగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని