Telangana News: గుజరాత్‌ కంటే తెలంగాణలోనే ఆశా కార్యకర్తల జీతం ఎక్కువ: హరీశ్‌రావు

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం అండగా ఉంటోందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు...

Published : 14 Feb 2022 01:04 IST

కామారెడ్డి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం అండగా ఉంటోందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆరోగ్య తెలంగాణే ధ్యేయంగా ఆశా కార్యకర్తలు.. సర్కారుకు ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డిలో ఆశా కార్యకర్తలకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  కామారెడ్డి జిల్లాలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉందని, ఆశావర్కర్లు గర్భిణీల్లో అవగాహన పెంచాలని సూచించారు. తెలంగాణ వచ్చినప్పుడు ఆశా కార్యకర్తల జీతం రూ.1500 ఉంటే ప్రస్తుతం రూ.9,750కి పెంచామని వెల్లడించారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఆశా కార్యకర్తల జీతం రూ.4వేలు.. భాజపా పాలిస్తున్న మధ్యప్రదేశ్‌లో రూ.3వేలు ఇస్తున్నారని వివరించారు. ఆశా కార్యకర్తలు  మెరుగ్గా పనిచేస్తే రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించవచ్చన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని