KTR: మేడిగడ్డ విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: కేటీఆర్‌

మేడిగడ్డ బ్యారేజ్‌ను శుక్రవారం భారాస నేతల బృందం పరిశీలించింది.

Updated : 01 Mar 2024 19:12 IST

మహదేవ్‌పూర్‌: మేడిగడ్డ అంశంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్‌ను శుక్రవారం భారాస నేతల బృందం పరిశీలించింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో  భాగమైన మేడిగడ్డలో చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూపిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు, రూ.లక్ష కోట్లు వృథా చేశారంటూ అధికార పార్టీ దుష్ప్రచారం చేయడం సరికాదు. పగ, కోపం ఉంటే రాజకీయంగా మాపీ తీర్చుకోండి. రైతులు, రాష్ట్రంపై వద్దు.  

1.6కి.మీ బ్యారేజ్‌లో 50 మీటర్ల ప్రాంతంలో సమస్య ఉంది. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నట్లుగా అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ హయాంలో కట్టిన కడెం, గుండ్లవాగు రెండుసార్లు కొట్టుకుపోయాయి. నాగార్జున సాగర్‌, శ్రీశైలంలోనూ లీకేజ్‌లు వచ్చాయి. వాటిపై మేం రాజకీయాలు చేయలేదు. నిపుణుల సలహాలు తీసుకొని వరదలు వచ్చేలోగా మేడిగడ్డను పునరుద్ధరించాలని కోరుతున్నాం’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని