Nitish kumar: నీతీశ్‌ యూటర్న్‌.. నెట్టింట ఫన్నీ మీమ్స్‌!

మహా కూటమికి గుడ్‌బై చెప్పి భాజపా పంచన చేరిన నీతీశ్‌ కుమార్‌పై నెట్టింట మీమ్స్‌ సందడి చేస్తున్నాయి. అవేంటో మీరూ చూసేయండి..

Published : 29 Jan 2024 19:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘చావనైనా చస్తాను గానీ భాజపాతో మళ్లీ కలవను’ అంటూ ప్రతిజ్ఞ చేసి ఏడాది కాకముందే బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ మరోసారి కూటమి మార్చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కూడిన మహా కూటమికి మరోసారి హ్యాండిచ్చి భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమితో జత కట్టారు. ఒకప్పుడు మంచి పాలకుడిగా పేరు తెచ్చుకున్న నీతీశ్‌.. పదే పదే కూటములు మారుస్తూ తన ప్రతిష్ఠను దిగజార్చుకున్నారు. దీంతో ఆయనపై నెట్టింట మీమ్స్‌ సందడి చేస్తున్నాయి. ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చినా నీతీశే సీఎం అనే అర్థం వచ్చేలా కొందరు మీమ్స్‌ పోస్ట్‌ చేస్తుండగా.. బిహార్‌లో రాజకీయ పరిస్థితులకు ఈ వీడియో సరిగ్గా సరిపోతుందంటూ ఓ సినిమాలోని క్లిప్పింగ్‌ను కొందరు పోస్ట్‌ చేస్తున్నారు. జేడీయూ పార్టీ గుర్తు (బాణం) కూడా నీతీశ్‌కు వైఖరికి అనుగుణంగా ఎటు కావాలంటే అటు దూసుకెళ్లగలదంటూ మరో నెటిజన్‌ పోస్ట్‌ చేశాడు. అలాంటి మీమ్స్‌ మీరూ చూసేయండి..





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని