Kishan Reddy: తెలంగాణలో మార్పు తీసుకువచ్చే వరకు పోరాటం: కిషన్‌ రెడ్డి

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వెనుక పెద్దల హస్తం ఉంది కాబట్టే దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 26 Mar 2023 18:21 IST

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీకేజీ అవ్వడంతో నిరుద్యోగులు ఆవేదనకు గురవుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. పేపర్‌ లీకేజీ దుర్మార్గమని మండిపడ్డారు. ఈ వ్యవహారం వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది కాబట్టి దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీఎస్‌పీఎస్సీ ముట్టడిలో అరెస్టయి.. జైలుకు వెళ్లిన భాజపా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్‌తో పాటు మరికొంతమంది నాయకులను కిషన్‌ రెడ్డి చంచల్‌గూడ జైలుకెళ్లి పరామర్శించారు. ప్రశ్నపత్రం లీకేజీ అంశంపై పోరాడితే యువ మోర్చా నాయకులపై కేసులు పెట్టడం దారుణమని మండిపడ్డారు. నిరసన తెలిపిన నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేశారని ధ్వజమెత్తారు. రాష్ర్ట ప్రభుత్వం తన అసమర్థతను అంగీకరించకుండా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబ, అవినీతి, మాఫియా పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో మార్పు తీసుకువచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని