Janasena: జగనన్న పాలవెల్లువ కాదు.. పాపాల వెల్లువ: నాదెండ్ల మనోహర్‌

జగనన్న పాలవెల్లువ పథకంలో అవకతవకలపై సీబీఐ విచారణకు సిద్ధమా?అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సవాల్‌ విసిరారు.

Updated : 08 Nov 2023 19:35 IST

అమరావతి: జగనన్న పాలవెల్లువ పథకంలో అవకతవకలపై సీబీఐ విచారణకు సిద్ధమా? అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సవాల్‌ విసిరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రులు ఎవరైనా క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తే అక్రమాలు తెలుస్తాయన్నారు. నవంబరు 14 నుంచి వైకాపా సర్కారు పథకాల్లోని అవినీతిని రోజుకొకటి చొప్పున బయటపెడతామని ప్రకటించారు.

నిజంగా రూ.2,350 కోట్లు ఖర్చు చేసి 3.94 లక్షల పాడి పశువులు కొనుగోలు చేసి ఉంటే.. కేవలం 2.70 లక్షల లీటర్ల పాలు మాత్రమే ఎందుకు సేకరిస్తున్నారని ప్రశ్నించారు. మిగతా 15.76 లక్షల లీటర్ల పాలు ఎక్కడికి పోయాయని నిలదీశారు. జగనన్న పాలవెల్లువ పేరుతో భారీ దోపిడీ జరిగిందని ఆరోపించారు. అది పాలవెల్లువ కాదని.. పాపాల పుట్ట అని విమర్శలు గుప్పించారు. పశువుల కొనుగోళ్లకు బ్యాంకులు రుణాలు ఇస్తే వివరాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పాడి పశువులను రీసైక్లింగ్ చేసినట్లు ప్రభుత్వమే చెప్పిందన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని