Nara Lokesh - Yuvagalam: జగన్‌ పాలనలో న్యాయవాదులూ బాధితులే: నారా లోకేశ్‌

న్యాయవాదులకు అనేక హామీలు ఇచ్చిన సీఎం జగన్‌.. వాటిలో ఒక్కటీ నెరవేర్చలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు.

Updated : 08 Jun 2023 14:13 IST

కడప: న్యాయవాదులకు అనేక హామీలు ఇచ్చిన సీఎం జగన్‌.. వాటిలో ఒక్కటీ నెరవేర్చలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. జగన్‌ పాలనలో న్యాయవాదులు కూడా బాధితులేనని ఆరోపించారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా కడపలో న్యాయవాదులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ  వైకాపా పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘సీఎం జగన్‌ అన్ని వ్యవస్థలనూ నాశనం చేశారు. ప్రజావేదిక కూల్చివేతతో పరిపాలన ప్రారంభించారు. న్యాయవాదులపైనా దాడులు చేయించారు. తెదేపా అధికారంలోకి వచ్చాక వెంటనే న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. రాజకీయ లబ్ధి కోసమే ప్రాంతాల మధ్య జగన్‌ చిచ్చుపెట్టారు. తెదేపా ప్రభుత్వం వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తాం. 

కోర్టుల్లో ఎంత దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయో నేను స్వయంగా చూశాను. కనీసం కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవు. తెదేపా ప్రభుత్వంలో న్యాయశాఖకు అధిక నిధులు కేటాయించి నూతన భవనాలు, మౌలిక వసతులు కల్పిస్తాం. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే కొత్త భవనాలు ఏర్పాటు చేస్తాం. న్యాయవాదులకు హెల్త్‌కార్డులు అందజేస్తాం. ఎవరైనా చనిపోతే వారి కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థికసాయం అందిస్తాం.  తెదేపా లీగల్‌ సెల్‌ను బలోపేతం చేస్తున్నాం.. ఇప్పుడు కష్టపడిన వారికి కచ్చితంగా పదవులు వస్తాయి. నామినేటెడ్‌ పదవుల్లోనూ న్యాయవాదులకు అవకాశం కల్పిస్తాం. చట్టాన్ని అతిక్రమించి న్యాయవాదులపై కేసులు పెట్టిన అధికారులపై జ్యుడీషియల్‌ విచారణ జరిపేలా చర్యలు తీసుకుంటాం’’ అని లోకేశ్ హామీ ఇచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని