నాపై దాడికి పాల్పడితే ఏం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా: పవన్‌ కల్యాణ్‌

అధికారం కోసం కాదు.. మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 

Updated : 14 Mar 2024 19:27 IST

మంగళగిరి: అధికారం కోసం కాదు.. మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

పవన్‌ కల్యాణ్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు

  • 150 మందితో జనసేనను ప్రారంభించాం.. ఇవాళ 6.50 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు ఉన్నారు.
  • ఒక ఆశయం కోసం వచ్చిన వాణ్ని ఓడిపోతే శూన్యమనిపించింది. అన్యాయం జరిగితే సగటు మనిషి తిరగబడేలా ధైర్యం ఇచ్చేందుకు వచ్చా.
  • ఇంకెవరూ బతక్కూడదు.. మా గుంపే బతకాలనుకుంటే కుదరదు. వైకాపా, జగన్‌పై నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు. కానీ, మమ్మల్ని తొక్కేస్తామంటే.. మేము తొక్కేస్తాం.
  • కుటుంబంలోని ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే కుటుంబ సభ్యులందరినీ ఇబ్బంది పెడతారని చాలా మంది భయపెట్టారు.
  • చట్టాలు అందరూ చెప్పే వారే.. కానీ ఎవరూ పాటించరు. అధికారంలో ఉన్న మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అనిపిస్తోంది.
  • ఒక సమూహాన్ని ప్రభావితం చేసే వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే పుట్టగతులు ఉండవనుకున్నారు. పుట్టక ముందే చంపే పరిస్థితిని తీసుకొచ్చారు.
  • నాపై దాడికి పాల్పడితే ఏం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ప్రజల కష్టాలు, కన్నీళ్లు నావే అనుకుని పనిచేస్తున్నా.
  • నటుడిగా, ప్రజాభిమానం ఉన్న వ్యక్తిగా ప్రపంచమంతా తెలుసు. తగ్గే కొద్దీ ఎదుగుతాం తప్ప.. నాశనం ఉండదు.
  • అప్పులు తెచ్చి వెల్ఫేర్‌ చేసుకుంటూ వెళ్లిపోతే. ప్రతి ఆటో డ్రైవర్‌, ప్రతి మహిళ.. శ్రీలంక అధ్యక్షుడి భవనాన్ని ఎలా వాడుకున్నారో తాడేపల్లి ప్యాలెస్‌ను కూడా అలాగే వాడుకుంటారు.
  • శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గతి ఒక ముఖ్యమంత్రికి జరగదని గ్యారంటీ ఏంటి. జనం తిరగబడితే ఎలా ఉంటుందో ఆంధ్రా - తెలంగాణ సరిహద్దులో చూశారు. ప్రజలు తిరగబడితే ఎవరూ తట్టుకోలేరు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని