Pilot Rohith Reddy: రుజువు చేస్తే.. రాజీనామాకు సిద్ధం: రోహిత్‌ రెడ్డి

కర్ణాటక డ్రగ్స్‌ కేసుకు సంబంధించి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దమ్ముంటే నిరూపించాలని..  ఆలయానికి తడివస్త్రాలతో వచ్చి ప్రమాణం చేయాలని..  తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి శనివారం సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే.

Updated : 18 Dec 2022 12:36 IST

హైదరాబాద్: కర్ణాటక డ్రగ్స్‌ కేసుకు సంబంధించి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దమ్ముంటే నిరూపించాలని..  ఆలయానికి తడివస్త్రాలతో వచ్చి ప్రమాణం చేయాలని..  తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి శనివారం సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకు రోహిత్ రెడ్డి చేరుకున్నారు. బండి సంజయ్‌ రాకపోవడంపై ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘‘బండి సంజయ్‌.. నా సవాలు ఎందుకు స్వీకరించలేదు? ఆయన.. నాపై చేసిన ఆరోపణలు తప్పు అని ప్రజలకి అర్థం అయింది. హిందుత్వం పేరుతో సంజయ్‌ యువతను రెచ్చగొడుతున్నారు. డ్రగ్స్‌ కేసుకు.. నాకు సంబంధం లేదు. భాజపా నేతలు నాపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే నేను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. వేములవాడ లేదా తాండూరు బద్రేశ్వర  స్వామి ఆలయం.. ఎక్కడికి వచ్చినా నేను సిద్ధమే.

గతంలో ఎమ్మెల్యే రఘునందన్‌ అక్రమ వసూలు చేసేవారు. ఆయన వందల కోట్లు ఎలా సంపాదించారు? రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. తాండూరు నియోజకవర్గ ప్రజల కోసం పోరాడుతున్నాను. తెలంగాణ ప్రజలపై భాజపా నేతలు.. దొంగ ప్రేమ చూపిస్తున్నారు. ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థల ద్వారా వేధిస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులకు భాజపా ఎందుకు మద్దతు ఇస్తుంది’’ అని రోహిత్‌ రెడ్డి ప్రశ్నించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని