Gujarat Election2022 : మధ్యాహ్నం 3 గంటల వరకు 48.5శాతం పోలింగ్‌ నమోదు

గుజరాత్‌లో తొలివిడత పోలింగ్‌ కొనసాగుతోంది. 89 నియోజకవర్గాల పరిధిలో మధ్యాహ్నం 3 గంటల వరకు 48.5శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

Updated : 01 Dec 2022 16:44 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్‌ కొనసాగుతోంది. 89 నియోజకవర్గాల పరిధిలో మధ్యాహ్నం 3 గంటల వరకు 48.5శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతందని, అప్పటి వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు హక్కు వినియోగించేందుకు అవకాశం కల్పిస్తామని అన్నారు. పోలింగ్‌ సమయం దగ్గర పడుతుండటంతో  పెద్ద సంఖ్యలో  ప్రజలు ఓటు వేసేందుకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు  తెలిపారు. ఓటుహక్కు వినియోగించుకునేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారిని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం తొలిసారిగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.  కొన్ని చోట్ల కంటెయినర్లతో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరిసరప్రాంతాల ప్రజలు అక్కడికి వెళ్లి ఓటు వేసేందుకు అవకాశం కల్పించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని