Renuka Chowdary: వీడియో బయటపెట్టిన రఘునందన్‌ కూడా నేరస్థుడే: రేణుకాచౌదరి

రాష్ట్రంలో రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు.

Updated : 07 Jun 2022 13:59 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలే కాదని.. పసి పిల్లలు కూడా సురక్షితంగా లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణలో రక్షణ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

రాష్ట్రంలో 418 మంది ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు జరిగినట్లు పోలీసు నివేదికలే చెబుతున్నాయన్నారు. అత్యాచార బాధితులకు ఎలా న్యాయం చేస్తారని ఆమె ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటనలో వీడియో బయటపెట్టిన భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు కూడా నేరస్థుడేనని రేణుకాచౌదరి అన్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌ వేధింపులు తాళలేక భాజపా కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే ఏం చర్యలు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని