
Ts News: హైదరాబాద్‌లో వామపక్ష కీలక నేతలతో సీఎం కేసీఆర్ భేటీ
హైదరాబాద్: వామపక్ష కీలక నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ వేర్వేరుగా భేటీ అయ్యారు. సీపీఎం, సీపీఐ జాతీయ నేతలతో ప్రగతి భవన్‌లో వేర్వేరుగా సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలకు హాజరయ్యేందుకు కేరళ సీఎం పినరయి విజయన్, మాజీ సీఎం మాణిక్ సర్కార్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హైదరాబాద్ వచ్చారు. ఏవైఎస్ఎఫ్ జాతీయ మహాసభల కోసం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కేరళ మంత్రి రాజన్, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీపీఎం, సీపీఐ జాతీయ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు, జాతీయ రాజకీయాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం, రైతు విధానాలు, రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై చర్చ జరిగినట్లు సమాచారం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.