Ts News: రైతులతో ఫుట్‌బాల్‌ ఆడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు: భట్టి

రాజకీయ ప్రయోజనాల కోసం భాజపా, తెరాస నాటకాలాడుతున్నాయని.. వీరి ఆటలో ప్రజలు పావులు కావొద్దని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. తెలంగాణ

Updated : 09 Aug 2022 12:14 IST

హైదరాబాద్‌: రాజకీయ ప్రయోజనాల కోసం భాజపా, తెరాస నాటకాలాడుతున్నాయని.. వీరి ఆటలో ప్రజలు పావులు కావొద్దని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. తెలంగాణ రైతులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫుట్‌బాల్‌ ఆడుతున్నాయని అగ్రహం వ్యక్తం చేశారు. యాసంగిలో వరి పండించొద్దని, పండిస్తే కొనమని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. పండిన ధాన్యం ఎలా కొనుగోలు చేయాలో ప్రణాళికలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. పంట మార్పిడిపై ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అనేకసార్లు దిల్లీ వెళ్లినా.. నదీజలాల విషయంలో ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నాగార్జునసాగర్ ఎండిపోయే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని