రోడ్డు మరమ్మతులు చేయించేందుకు యత్నించిన మాజీ ఎమ్మెల్యే.. ధర్మవరంలో ఉద్రిక్తత

సత్యసాయి జిల్లా ధర్మవరం మార్కెట్‌ యార్డు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Updated : 01 Feb 2024 15:23 IST

ధర్మవరం పట్టణం: సత్యసాయి జిల్లా ధర్మవరం మార్కెట్‌ యార్డు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుంతలు పడ్డ రోడ్డుకు మరమ్మతులు చేయించేందుకు సామగ్రితో వెళ్లిన మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్‌అండ్‌బీ రహదారులు గుంతలు పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే మరమ్మతులు చేయాలని గతంలో గోనుగుంట్ల ఫిర్యాదు చేశారు. జనవరి ఆఖరులోగా బాగు చేస్తామని వారు హామీ ఇచ్చారు. గడువులోగా పూడ్చకపోతే తన సొంత ఖర్చుతో మరమ్మతులు చేయిస్తానని సూర్యనారాయణ చెప్పారు.

ఆ గడువు ముగియడంతో గుంతలు పూడ్చేందుకు యత్నించిన గోనుగుంట్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, మాజీ ఎమ్మెల్యేకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ సూర్యనారాయణ కార్యకర్తలతో కలసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు మరమ్మతులు ఎప్పుడు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం సూర్యనారాయణను అరెస్టు చేసి ధర్మవరం పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని