ఓటర్లను చైతన్య పరచాలి

ఓటు హక్కును ప్రతి ఒక్కరూ విధిగా వినియోగించుకునేలా ఎన్నికల వ్యవస్థలు చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సూచించారు. ఎన్నికల ప్రకటన వెలువడడానికి ముందే ఎన్నికల సంఘం ఓటర్లకు అవగాహన

Published : 21 May 2022 05:59 IST

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

ఈనాడు, అమరావతి: ఓటు హక్కును ప్రతి ఒక్కరూ విధిగా వినియోగించుకునేలా ఎన్నికల వ్యవస్థలు చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సూచించారు. ఎన్నికల ప్రకటన వెలువడడానికి ముందే ఎన్నికల సంఘం ఓటర్లకు అవగాహన కల్పించడం వంటి కీలకమైన వ్యవహారాలపై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా బాధ్యతలు చేపట్టిన ముకేష్‌కుమార్‌ మీనా శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపడుతున్న కార్యక్రమాల గురించి గవర్నర్‌కు నివేదించారు. ఈ భేటీలో గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని