కుతుబ్‌మినార్‌ వద్ద లభించిన విగ్రహాలు

కుతుబ్‌మినార్‌ ప్రాంగణంలో లభించిన హిందూ, జైన ప్రతిమలను నిపుణుల వద్దకు పంపించాలనే యోచనలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఉందని సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపే ఉద్దేశం కానీ, మతపరమైన

Updated : 24 May 2022 06:01 IST

 నిపుణుల పరిశీలనకు పంపే అవకాశం!

దిల్లీ: కుతుబ్‌మినార్‌ ప్రాంగణంలో లభించిన హిందూ, జైన ప్రతిమలను నిపుణుల వద్దకు పంపించాలనే యోచనలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఉందని సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపే ఉద్దేశం కానీ, మతపరమైన కార్యక్రమాలను నిలిపివేసే యోచన కానీ లేదని తెలిపారు. కువ్వతుల్‌ ఇస్లాం మసీదు సమీపంలో లభించిన గణేశుని విగ్రహాలను సురక్షితమైన ప్రాంతానికి తరలించాలని కోరుతూ జాతీయ పురావస్తు సంస్థ ఛైర్‌పర్సన్‌ తరుణ్‌ విజయ్‌ ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌ఐ)కు లేఖ రాసిన నేపథ్యంలో ఆ అధికారి ఈ విషయాన్ని తెలిపారు. కుతుబ్‌మినార్‌ ప్రాంగణంలో లభించిన విగ్రహాలను ప్రతిమాశాస్త్ర నిపుణుల ద్వారా విశ్లేషించిన తర్వాత ఆ వివరాలతో కలిపి కొన్నిటిని ప్రదర్శనకు ఉంచాలని సాంస్కృతిక శాఖ భావిస్తుందని సమాచారం. ఆలయాల రాళ్లతో మసీదులు నిర్మించినందున వివిధ రూపాల్లో ఉన్న విగ్రహాలు అంతటా కనిపిస్తుంటాయని, బయల్పడిన విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠించే ప్రణాళిక కానీ, మరో చోటకు తరలించే యోచన కానీ లేదని ఆ అధికారి వివరించారు. కుతుబ్‌మినార్‌ ప్రాంగణంలో తవ్వకాలు జరపాలంటూ ఏఎస్‌ఐని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందనే విమర్శలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి తోసిపుచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని