Punjab Elections 2022: ‘మోదీ బడే మియా.. కేజ్రీవాల్‌ ఛోటే మియా’

ప్రధానమంత్రి మోదీ బడేమియా.. దిల్లీ సీఎం కేజ్రీవాలే ఛోటే మియా అని.. ఇద్దరూ మతాన్ని, ప్రజల భావోద్వేగాలను

Updated : 18 Feb 2022 09:32 IST

పంజాబ్‌ ఎన్నికల ర్యాలీలో ప్రియాంక 

చండీగఢ్‌: ప్రధానమంత్రి మోదీ బడేమియా.. దిల్లీ సీఎం కేజ్రీవాలే ఛోటే మియా అని.. ఇద్దరూ మతాన్ని, ప్రజల భావోద్వేగాలను రాజకీయ లాభాల కోసం వాడుకుంటారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విమర్శించారు. వీరి పరిపాలన కూడా కేవలం ప్రకటనల్లో మాత్రమే కనిపిస్తుందని అన్నారు. ఇద్దరికీ ఆరెస్సెస్‌తో సంబంధం ఉందని అన్నారు. మోదీ ఆరెస్సెస్‌ నుంచి వస్తే.. నాటి మన్మోహన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ చేసిన ఆందోళనకు ఆరెస్సెస్‌ మద్దతిచ్చిందని అన్నారు.

ఉచిత విద్యుత్‌ ఇవ్వనన్నారనే అమరీందర్‌ను తొలగించాం: రాహుల్‌

పంజాబ్‌లో ఓ ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. పంజాబ్‌ సీఎంగా కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ను తొలగించడానికి కారణం చెప్పారు. పేద ప్రజలకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడానికి అమరీందర్‌ నిరాకరించారని, విద్యుత్‌ కంపెనీలతో కాంట్రాక్టు ఉందని చెప్పారని అందుకే.. ఆయన్ను తొలగించి చన్నీని సీఎం చేశామని చెప్పారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని