Nawab Malik: నవాబ్‌ మాలిక్‌ విడుదలకు రూ.3 కోట్లు డిమాండ్‌!

మనీలాండరింగ్‌ కేసులో అరెస్ట యి జైలులో ఉన్న మహారాష్ట్ర మంత్రి

Published : 18 Mar 2022 10:42 IST

ముంబయి: మనీలాండరింగ్‌ కేసులో అరెస్ట యి జైలులో ఉన్న మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ విడుదలకు అతని కుమారుడు అమీర్‌ను రూ.3 కోట్లు డిమాండ్‌ చేసిన వ్యక్తిపై పోలీసు కేసు నమోదైంది. రూ.3 కోట్లను బిట్‌కాయిన్ల రూపంలో ఇస్తే మీ తండ్రిని విడుదల చేయిస్తానంటూ ఇంతియాజ్‌ అనే వ్యక్తి.. అమీర్‌ మాలిక్‌కు ఈమెయిల్‌ చేశాడు. దీనిపై అమీర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుర్తుతెలియని వ్యక్తిపై గురువారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నవాబ్‌ మాలిక్‌ ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీపై ముంబయిలోని ఆర్థర్‌ రోడ్‌ జైలులో ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని