Harbhajan Singh: వాళ్ల జోక్యం వల్లే..

తనను హఠాత్తుగా జట్టు నుంచి తప్పించి ఉండకపోతే టెస్టుల్లో తాను మరో 100-150 వికెట్లు పడగొట్టేవాడినని ఇటీవలే రిటైరైన స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అన్నాడు.

Updated : 02 Jan 2022 07:20 IST

ముంబయి:  తనను హఠాత్తుగా జట్టు నుంచి తప్పించి ఉండకపోతే టెస్టుల్లో తాను మరో 100-150 వికెట్లు పడగొట్టేవాడినని ఇటీవలే రిటైరైన స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అన్నాడు.  ‘‘అదృష్టం ఎప్పుడు నా పక్షానే ఉంది. కొన్ని ఇతర అంశాలు నావైపు లేవు. అవి నాకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. నేను బౌలింగ్‌ చేస్తున్న తీరు,  పురోగమిస్తున్న తీరే అందుకు కారణం. నేను 400 వికెట్లు తీసినప్పుడు నా వయసు 31 ఏళ్లు. మరో 4-5 ఏళ్లు ఆడగలిగితే మరో 100-150 వికెట్లు పడగొట్టగలిగేవాణ్ని’’ అని ఓ ఇంటర్వ్యూలో భజ్జీ చెప్పాడు. బోర్డు నుంచి ఇతర ఆటగాళ్లకంటే మాజీ కెప్టెన్‌ ధోనీకి ఎక్కువ మద్దతు లభించిందని అన్నాడు. ‘‘అవును.. అప్పుడు ధోనీనే కెప్టెన్‌. కానీ ఇది (భజ్జీ ఎంపిక) అతడి చేతుల్లోనూ లేదు. కొందరు బీసీసీఐ అధికారులు కొంతవరకు ఇందులో జోక్యం చేసుకున్నారు. నేను జట్టులో ఉండడం వాళ్లకు ఇష్టం లేదు. ధోని వాళ్లకు మద్దతిచ్చి ఉంటాడు. అంతే కానీ.. కెప్టెన్‌ ఎప్పుడూ బీసీసీఐ కంటే ఎక్కువ కాదు. ఎప్పుడైనా బీసీసీఐ అధికారులే కెప్టెన్‌ కన్నా కోచ్‌ లేదా జట్టు కన్నా ఎక్కువ. బీసీసీఐ నుంచి ఇతర ఆటగాళ్ల కన్నా ధోనీకి ఎక్కువ మద్దతు లభించింది. అలా మద్దతు లభించి ఉంటే వాళ్లు కూడా ఎక్కువ కాలం ఆడేవాళ్లు’’ అని హర్భజన్‌ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని