Wriddhiman Saha - BCCI: ఎవరా పాత్రికేయుడు.. ఏమా కథ?

ఇంటర్వ్యూ ఇవ్వనందుకు సీనియర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాపై బెదిరింపులకు పాల్పడిన పాత్రికేయుడు ఎవరో అడిగి తెలుసుకుంటామని బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధూమల్‌ తెలిపాడు.

Updated : 22 Feb 2022 08:05 IST

సాహాను అడగనున్న బీసీసీఐ

ముంబయి: ఇంటర్వ్యూ ఇవ్వనందుకు సీనియర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాపై బెదిరింపులకు పాల్పడిన పాత్రికేయుడు ఎవరో అడిగి తెలుసుకుంటామని బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధూమల్‌ తెలిపాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత జట్టులో చోటు కోల్పోయిన సాహా.. ఈ విషయమై తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఓ పాత్రికేయుడు తనను ఇంటర్వ్యూ అడిగి.. తాను అంగీకరించనందుకు బెదిరింపులకు పాల్పడిన వైనాన్ని స్క్రీన్‌ షాట్‌ రూపంలో బయటపెట్టాడు సాహా. ఒక పాత్రికేయుడు టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడిని ఇలా బెదిరించడంపై మాజీ కోచ్‌ రవిశాస్త్రితో సెహ్వాగ్‌, హర్భజన్‌ లాంటి మాజీ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో బీసీసీఐ అధ్యక్షుడు జోక్యం చేసుకుని ఆటగాళ్లతో ఇంకెవరూ ఇలా వ్యవహరించకుండా చూడాలని రవిశాస్త్రి కోరాడు. దీంతో అరుణ్‌ ధూమల్‌ స్పందించాడు. ‘‘తన ట్వీట్‌ గురించి సాహాతో మాట్లాడతాం. నిజంగా దీని వెనుక అసలేం జరిగిందో.. తనను బెదిరించారేమో అడుగుతాం. అంతకుమించి దీని గురించి ఇప్పుడేం చెప్పలేం. బీసీసీఐ కార్యదర్శి సాహాతో మాట్లాడతారు’’ అని ధూమల్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని