సింధుకు క్షమాపణలు

భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధుకు ఆసియా బ్యాడ్మింటన్‌ సాంకేతిక కమిటీ క్షమాపణలు చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆసియా ఛాంపియన్‌షిప్‌ సెమీస్‌లో రిఫరీ తప్పిదానికి కమిటీ ఛైర్మన్‌ చై షెన్‌ చెన్‌ క్షమాపణలు కోరారు. అకానె యమగూచి (జపాన్‌)తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌ తప్పిదం కారణంగా సింధు ఒక పాయింటు కోల్పోయింది. స

Published : 06 Jul 2022 02:57 IST

దిల్లీ: భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధుకు ఆసియా బ్యాడ్మింటన్‌ సాంకేతిక కమిటీ క్షమాపణలు చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆసియా ఛాంపియన్‌షిప్‌ సెమీస్‌లో రిఫరీ తప్పిదానికి కమిటీ ఛైర్మన్‌ చై షెన్‌ చెన్‌ క్షమాపణలు కోరారు. అకానె యమగూచి (జపాన్‌)తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌ తప్పిదం కారణంగా సింధు ఒక పాయింటు కోల్పోయింది. సర్వ్‌ ఆలస్యమైన కారణంగా సింధుకు అంపైర్‌ ఒక పాయింటు కోత విధించాడు. ప్రత్యర్థి సిద్ధంగా లేదంటూ సింధు ఎంత వాదించినా ఫలితం లేకపోయింది. తొలి గేమ్‌ గెలిచి.. రెండో గేమ్‌లో 14-11తో సింధు ఆధిక్యంలో ఉన్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఏకాగ్రత కోల్పోయిన సింధు పరాజయం చవిచూసింది. కాంస్యంతో సరిపెట్టుకున్న సింధు.. మ్యాచ్‌ అనంతరం తనకు జరిగిన అన్యాయం పట్ల కన్నీళ్లు పెట్టుకుంది. ‘‘దురదృష్టవశాత్తు ఆ తప్పును ఇప్పుడు సరిదిద్దలేం. మరోసారి ఇలాంటి మానవ తప్పిదం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకున్నాం. మీకు కలిగిన అసౌకర్యానికి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం. ఇది క్రీడల్లో భాగమని, దాన్ని మీరు అంగీకరిస్తారని నమ్ముతున్నాం’’ అని సింధుకు రాసిన లేఖలో కమిటీ ఛైర్మన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని