Hockey: పురుషుల హాకీలో రజతమే

కామన్వెల్త్‌ పురుషుల హాకీలో భారత్‌ రజత పతకంతో సరిపెట్టుకుంది. సోమవారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో 0-7తో ఆస్ట్రేలియా చేతిలో పరాజయంపాలైంది. తీవ్రంగా తడబడ్డ భారత్‌ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. అత్యంత పేలవ ప్రదర్శనతో బలమైన ప్రత్యర్థిపై ఒక్క గోల్‌ కూడా కొట్టలేకపోయింది. మ్యాచ్‌ మొత్తంలో

Updated : 15 Aug 2022 14:20 IST

ఫైనల్లో ఆసీస్‌ చేతిలో ఓడిన భారత్‌

కామన్వెల్త్‌ పురుషుల హాకీలో భారత్‌ రజత పతకంతో సరిపెట్టుకుంది. సోమవారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో 0-7తో ఆస్ట్రేలియా చేతిలో పరాజయంపాలైంది. తీవ్రంగా తడబడ్డ భారత్‌ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. అత్యంత పేలవ ప్రదర్శనతో బలమైన ప్రత్యర్థిపై ఒక్క గోల్‌ కూడా కొట్టలేకపోయింది. మ్యాచ్‌ మొత్తంలో ఒకే ఒక్కసారి ప్రత్యర్థి గోల్‌పై దాడి చేసింది. విరామానికే 0-5తో భారత్‌ ఓటమి దాదాపుగా ఖాయమైపోయింది. ఆరంభం నుంచి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆసీస్‌.. భారత్‌కు ఊపిరి సలపనివ్వలేదు. ఆస్ట్రేలియా తరఫున ఎఫ్రామస్‌ (14వ, 42వ), జాకబ్‌ అండర్సన్‌ (22వ, 27వ) చెరో రెండు గోల్స్‌ కొట్టగా.. బ్లేక్‌ గోవర్స్‌ (9వ), విక్‌హామ్‌ (26వ), ఒగిల్వీ (46వ) తలో గోల్‌ సాధించారు. కామన్వెల్త్‌ క్రీడల్లో ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్లో ఓడడం భారత్‌కు ఇది మూడోసారి. ఇంతకుముందు 2010, 2014లో కూడా ఇలాగే ఓడింది. 1998లో కామన్వెల్త్‌ క్రీడల్లో హాకీని ప్రవేశపెట్టినప్పటి నుంచి పురుషుల హాకీలో ఆస్ట్రేలియానే విజేత.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని