ప్రజ్ఞానంద హ్యాట్రిక్‌

అమెరికన్‌ ఫైనల్‌ ఆఫ్‌ ఛాంపియన్స్‌ చెస్‌ టూర్‌లో భాగంగా జరుగుతున్న ఎఫ్‌టీఎక్స్‌ క్రిప్టో కప్‌లో భారత యువ సంచలనం ప్రజ్ఞానంద హ్యాట్రిక్‌ విజయాన్ని సాధించాడు.

Published : 19 Aug 2022 02:35 IST

మియామి: అమెరికన్‌ ఫైనల్‌ ఆఫ్‌ ఛాంపియన్స్‌ చెస్‌ టూర్‌లో భాగంగా జరుగుతున్న ఎఫ్‌టీఎక్స్‌ క్రిప్టో కప్‌లో భారత యువ సంచలనం ప్రజ్ఞానంద హ్యాట్రిక్‌ విజయాన్ని సాధించాడు. గురువారం మూడో రౌండ్లో హన్స్‌ నీమన్‌ (అమెరికా)పై 2.5-1.5తో విజయం సాధించాడు. నాలుగు గేమ్‌ల ఈ పోరులో తొలి గేమ్‌లో ఓడిన ప్రజ్ఞానంద.. రెండు, నాలుగు గేమ్‌లలో నెగ్గి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మూడో గేమ్‌ డ్రాగా ముగిసింది. ఈ విజయంతో తొమ్మిది పాయింట్లతో మాగ్నస్‌ కార్ల్‌సన్‌తో సంయుక్తంగా ప్రజ్ఞానంద అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ టోర్నీలో తొలి రౌండ్లో అలీరెజాపై, రెండో రౌండ్లో అనీష్‌ గిరిపై ప్రజ్ఞానంద గెలిచాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts