ఎన్నికల నిర్వహణ దిశగా..

భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ)లో సంస్కరణల దిశగా కీలక అడుగు పడింది. ఐఓఏ రాజ్యాంగ సవరణ, ఎన్నికల నిర్వహణ కోసం మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వర రావును సుప్రీం కోర్టు గురువారం 

Published : 23 Sep 2022 02:55 IST

దిల్లీ: భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ)లో సంస్కరణల దిశగా కీలక అడుగు పడింది. ఐఓఏ రాజ్యాంగ సవరణ, ఎన్నికల నిర్వహణ కోసం మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వర రావును సుప్రీం కోర్టు గురువారం నియమించింది. దేశంలో ఒలింపిక్స్‌ భవిష్యత్‌ కోసం ఈ మాజీ న్యాయమూర్తి న్యాయమైన, అభివృద్ధి ఆధారిత విధానాన్ని అనుసరిస్తారని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సందర్భంగా తెలిపింది. రాజ్యాంగ సవరణతో పాటు డిసెంబర్‌ 15 లోపు ఐఓఏ ఎన్నికలు జరిగేలా బృహత్తర ప్రణాళిక రూపొందించాలని జస్టిస్‌ నాగేశ్వర రావును కోర్టు ఆదేశించింది. ‘‘జస్టిస్‌ నాగేశ్వర రావుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కేంద్ర క్రీడా శాఖ సంయుక్త కార్యదర్శి అందుబాటులో ఉండేలా చూడాలి. వీటికి అయ్యే ఖర్చును ఐఓఏ తిరిగి చెల్లించాలి’’ అని ధర్మాసనం పేర్కొంది. అందుకు గాను రూ.10 లక్షలను కేంద్ర మంత్రిత్వ శాఖ దగ్గర జమ చేయాలని ఐఓఏకు సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని