Rohit Sharma: ‘రోహిత్ శర్మ, ఇషాన్‌ కిషన్‌ తిరిగి పుంజుకుంటారు’

టీ20 లీగ్‌లో ఈ సీజన్‌లో ముంబయి జట్టు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓటమిపాలై ఇప్పటివరకు బోణీ కొట్టలేదు. ఇటు బ్యాటింగ్‌, అటు బౌలింగ్‌లో ఆ జట్టు పూర్తిగా విఫలమవుతోంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్‌ శర్మ, ఓపెనర్ ఇషాన్ కిషన్‌ ఆశించిన రీతిలో పరుగులు చేయడం లేదు.

Published : 30 Apr 2022 02:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 లీగ్‌లో ఈ సీజన్‌లో ముంబయి జట్టు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓటమిపాలై ఇప్పటివరకూ బోణీ కొట్టలేదు. ఇటు బ్యాటింగ్‌, అటు బౌలింగ్‌లో ఆ జట్టు పూర్తిగా విఫలమవుతోంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్‌ శర్మ, ఓపెనర్ ఇషాన్ కిషన్‌ ఆశించిన రీతిలో పరుగులు చేయడం లేదు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌ల్లో ఇషాన్ కిషన్‌‌ 199 పరుగులు చేయగా.. రోహిత్‌ శర్మ కేవలం 153 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇదిలా ఉండగా.. శనివారం రాజస్థాన్‌తో ముంబయి తలపడనుంది. ఈ నేపథ్యంలో ముంబయి బ్యాటింగ్ కోచ్‌ రాబిన్‌ సింగ్‌ వర్చువల్‌గా మీడియాతో మాట్లాడారు. రోహిత్ శర్మ, ఇషాన్‌ కిషన్‌ మిగిలిన మ్యాచ్‌ల్లో తిరిగి బలం పుంజుకుంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

'ఇషాన్‌ కిషన్ ఆటతీరు మెరుగుపడటం కోసం మేం కొన్ని అంశాలను గుర్తించాం. ఈ సీజన్‌ని అతడు బాగానే ఆరంభించాడు. కానీ ఇప్పుడు కాస్త వెనకబడ్డాడు. తిరిగి ఫామ్‌ని అందుకుంటాడని భావిస్తున్నాం. ఒక బ్యాట్స్‌మన్‌గా మీకు ఏది ముఖ్యం అనిపిస్తే అదే చేయాలి. అతడు (రోహిత్ శర్మ) చాలా కష్టపడుతున్నాడని నేను భావిస్తున్నా. అతడు ఇంకా ఏం చేయాలనే విషయాలను మేం ప్రస్తావించాం. వ్యక్తిగతంగా, సీనియర్ బ్యాట్స్‌మన్‌గా అతనికి తన బాధ్యత ఏంటో తెలుసు. కాబట్టి రోహిత్‌ చాలా బలంగా తిరిగి వస్తాడని నమ్మకం ఉంది’ అని రాబిన్‌ సింగ్ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు