Rahul Dravid : బజ్‌బాల్ అంటే ఏమిటీ?
బజ్‌బాల్.. ఇటీవల ఇంగ్లాండ్ దూకుడైన ఆటతీరును సూచిస్తూ ఎక్కువగా వినిపిస్తున్న పేరిది. ఈ నేపథ్యంలో బజ్‌బాల్ గురించి టీమ్ఇండియా కోచ్ ద్రవిడ్‌ను ప్రశ్నించగా..
బర్మింగ్‌హామ్: బజ్‌బాల్.. ఇటీవల ఇంగ్లాండ్ దూకుడైన ఆటతీరును సూచిస్తూ ఎక్కువగా వినిపిస్తున్న పేరిది. ఈ నేపథ్యంలో బజ్‌బాల్ గురించి టీమ్ఇండియా కోచ్ ద్రవిడ్‌ను ప్రశ్నించగా.. అదేమిటో తనకు తెలీదని బదులిచ్చాడు. ‘‘బజ్‌బాల్ అంటే తెలియదు. గత నాలుగు టెస్టుల్లో ఇంగ్లాండ్ ఆడిన తీరు, నాలుగో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఛేదన లాంటివి ఈ దేశంలో తరచుగా కనిపించవని మాత్రం చెప్తా. కానీ మన ఆటతీరు అనేది ఆటగాళ్లపై, వాళ్ల ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లుంటే సానుకూల దృక్పథంతో క్రికెట్ ఆడి ఆటను ముందుకు తీసుకెళ్లొచ్చు’’ అని అతను చెప్పాడు.
ఆ పేరు ఎందుకు వచ్చిందంటే: ప్రస్తుతం ఇంగ్లాండ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ ఉన్నాడు. అతని ముద్దుపేరు బజ్. పరుగులు చేయడానికి ప్రతి బంతి ఓ అవకాశమే, కేవలం మనుగడ కోసం క్రీజులో ఉండిపోకూడదనేది అతని సిద్ధాంతం. కివీస్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అతను జట్టుకూ అదే నూరిపోశాడు. ఇక భారత టీ20 లీగ్‌లో కోల్‌కతా కోచ్‌గానూ అతను జట్టును అదే పంథాలో నడిపిస్తున్నాడు. ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే తన లాంటి మనస్తత్వమే ఉన్న స్టోక్స్ కెప్టెన్‌గా ఉండడమూ మెక్‌కలమ్‌కు కలిసొచ్చింది. భారత్‌తో సిరీస్‌లో ఎదురుదెబ్బ, యాషెస్‌లో పరాజయంతో ఢీలా పడ్డ జట్టులో తన సిద్ధాంతంతో ధైర్యం నింపాడు. భయం లేకుండా ఆడడం అలవాటు చేశాడు. అందుకే ఇప్పుడు ఇంగ్లాండ్ ఆటతీరు గురించి అందరూ బజ్‌బాల్ అని మాట్లాడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్‌కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్‌గా రావడానికి కారణమిదే!
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్‌ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్‌లో ఉన్న హమీదా బాను ఎవరు?