
నేటి నుంచి ఆన్‌లైన్‌లో కోర్టుల విచారణ
కరోనా వ్యాప్తి నేపథ్యంలో మంగళవారం నుంచి హైకోర్టుతో సహా అన్ని కోర్టుల్లో ఆన్‌లైన్‌లోనే విచారణ నిర్వహించాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జిల్లా కోర్టులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 4 వరకు కోర్టుల విచారణ, నిర్వహణ ఆన్‌లైన్‌లోనే కొనసాగుతుందని రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే.. కొత్తగా ఎంపికైన 65 మంది జూనియర్ సివిల్ జడ్జీలకు గతేడాది డిసెంబరు1 నుంచి జరుగుతున్న శిక్షణ తరగతులనూ మార్చి 31 వరకు ఆన్‌లైన్‌లోనే కొనసాగించాలని హైకోర్టు నిర్ణయించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.