ఆర్టీసీ ఇంకా కోలుకోలేదు: పువ్వాడ

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇంకా నష్టాల నుంచి పూర్తిగా కోలుకోలేదని, ఇప్పటికీ సగం ఆదాయమే వస్తోందని మంత్రి పువ్వాడ అజయ్‌ తెలిపారు. మెట్రో రైలును ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు

Published : 21 Jan 2022 06:11 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇంకా నష్టాల నుంచి పూర్తిగా కోలుకోలేదని, ఇప్పటికీ సగం ఆదాయమే వస్తోందని మంత్రి పువ్వాడ అజయ్‌ తెలిపారు. మెట్రో రైలును ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఖమ్మం జిల్లాలోని తెరాసలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. గురువారం శాసనమండలి సమావేశ మందిరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీని కాపాడుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. మెట్రో రైలులో రోజుకు నాలుగు లక్షల మంది ప్రయాణిస్తేనే.. నష్టాలుండవని పేర్కొన్నారు. మెట్రోకు భూములు ఇచ్చినా.. పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకోలేదన్నారు. మెట్రో రైలు విషయంలో మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని