Updated : 02/09/2020 13:46 IST

₹15 వేల లోపు ట్యాబ్స్‌ కొనాలనుకుంటున్నారా?

కరోనా మహమ్మారి దెబ్బకు థియేటర్లు, పాఠశాలలు, కళాశాలలు ఇంకా తెరుచుకోలేదు. అంతా ఆన్‌లైన్‌లోనే పాఠాలు వినడం, సినిమాలను వీక్షించడం. అయితే చాలా మందికి ఇప్పటికీ స్మార్ట్‌ఫోన్లు లేనేలేవు. ఉన్న కొద్ది మందివి కూడా వారి నాన్నదో, అమ్మదో, సోదరుడిదో అయి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్‌లు మహా అయితే 6 నుంచి 7 అంగుళాలలోపే ఉంటాయి. సినిమాలు, ఆన్‌లైన్‌ తరగతులకు సంబంధించి పెద్దగా క్లారిటీగా ఉండకపోవచ్చు.

ఇళ్లల్లో డెస్క్‌టాప్‌ లేదా ల్యాప్‌టాప్‌ ఉంటే కచ్చితంగా వై ఫై రూటర్‌ను ఏర్పాటు చేసుకుంటారు. దాని వల్ల ఇటు డెస్క్‌టాప్‌‌/ల్యాపీలతోపాటు ఫోన్లకు డేటాను వినియోగించుకోవచ్చు. అయితే ఎవరికైనా అత్యవసర కాల్‌ వస్తే ఆన్‌లైన్‌ తరగతికి అంతరాయం కలుగుతుంది. దీని నుంచి గట్టెక్కాలంటే ట్యాబ్లెట్‌.. అదే ట్యాబ్స్‌ అయితే తెర పెద్దదిగానూ ఉండి వైఫైను వాడుకోవడం ద్వారా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆన్‌లైన్‌లో సినిమాలను వీక్షించడం, తరగతులను వినవచ్చు. అయితే గతంలో ట్యాబ్‌ అనగానే భారీగా వెచ్చించాల్సి వచ్చేది. ప్రస్తుతం రూ.15వేలు లోపే పలు సంస్థల ట్యాబ్స్‌ అందుబాటులోకి వచ్చాయి. సీజన్‌నుబట్టి ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఇంకా తక్కువ ధరకే దొరకవచ్చు. మరి ట్యాబ్‌ల వివరాలు ఏంటో ఓసారి చూసేద్దాం...


హువాయ్‌ మీడియాపాడ్‌ T5

హువాయ్‌ మీడియాపాడ్‌ టీ5 ట్యాబ్‌ గతేడాది వచ్చింది. దాని ధర రూ.14,999. హువాయ్‌ మీడియాపాడ్‌ టీ5 స్క్రీన్‌ 10.1 అంగుళాలు. 1080P ఫుల్‌ హెచ్‌డీ‌ vivid డిస్‌ప్లే. ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో ఓఎస్‌. ఈఎంయూఐ 8.0 స్కిన్‌ ఆన్‌టాప్‌. 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, ఎక్స్‌పాండబుల్‌ అప్‌టు 256 జీబీ.  హువాయ్‌ మీడియాపాడ్‌ 4G సపోర్ట్‌ చేస్తుంది. 5 ఎంపీ రేర్‌ కెమెరా 5100ఎంఏహెచ్‌ బ్యాటరీ. 4D సౌండ్‌తో స్టీరియో స్పీకర్‌ అందుబాటులో ఉంది. అయితే అమెరికాలో హువాయ్‌  ఉత్పత్తులు బ్యాన్‌ కావడంతో అప్పటి నుంచి ఆండ్రాయిడ్‌ అప్‌డేషన్‌ రాలేదు.


శ్యామ్‌సంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ A

2019 ప్రారంభంలో శ్యామ్‌సంగ్‌ తన కొత్త ట్యాబ్‌ను విడుదల చేసింది. గెలాక్సీ ట్యాబ్‌ A 10.1 స్పోర్ట్స్‌ పేరుతో మార్కెట్‌లోకి వచ్చింది. 1920X1200 పిక్సెల్స్‌ 10.1 అంగుళాల డిస్‌ప్లేతో ఆకట్టుకుంటుంది. ఇందులో శ్యామ్‌సంగ్‌ సొంత Exynos 7904 ప్రాసెసర్‌ను ఉపయోగించింది. 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ 400 జీబీ ఎక్స్‌పాండబుల్‌ మెమొరీ ఉంది. డాల్బీ 3డీ అట్మాస్‌ సౌండ్‌తో డ్యూయల్‌ స్పీకర్లు‌ వచ్చాయి. వెనుకవైపు 8ఎంపీ కెమెరా సెన్సర్‌, 5ఎంపీ ఫ్రంట్‌ కెమెరా అందుబాటులోకి తెచ్చింది. 6,150 ఎంఏహెచ్‌ బ్యాటరీతో పని చేస్తుంది. దీనికి కేవలం వైఫై  కనెక్ట్‌ మాత్రమే ఉంది. 4జీ సపోర్ట్‌ చేయకపోవడం మైనస్‌గానే చెప్పుకోవచ్చు. అయితే 8 అంగుళాల డిస్‌ప్లేతో 4జీ సపోర్ట్‌ చేసే విధంగా ట్యాబ్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తేవడం మంచి పరిణామంగా పేర్కొనవచ్చు. శ్యామ్‌సంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ A ధర రూ.14,999 కాగా.. 8 అంగుళాల వెర్షన్‌ ధర రూ.11,999. శ్యామ్‌సంగ్‌ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లో దొరుకుతాయి. 


పానాసోనిక్‌ ట్యాబ్‌ 8 HD

4జీ సపోర్ట్‌తో ట్యాబ్లెట్‌ కొనుగోలు చేయాలనే వారికి పానాసోనిక్‌ ట్యాబ్‌ 8 D మంచి ఎంపికగా టెక్‌ నిపుణులు పేర్కొన్నారు. అయితే ఇది 8 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేతో 1200×800 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ ఉంటుంది. ఆండ్రాయిడ్‌ Pie v9.0 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో మీడియాటెక్‌ 2.0 GHz ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 3జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీతోపాటు మైక్రో ఎస్‌డీ కార్డ్‌ ద్వారా 512 జీబీ వరకు స్టోరేజీని ఎక్స్‌పాండబుల్‌ చేసుకోవచ్చు. 5,010 ఎంఏహెచ్‌ బ్యాటరీతో పని చేస్తుంది. వెనుక వైపు 8ఎంపీ, ముందు భాగంలో 5ఎంపీ కెమెరా ఉన్నాయి. ఇది కేవలం రూ.12,490లలో దొరుకుతుంది. 


లెనోవో ట్యాబ్‌ ఎం10 HD

లెనోవో ట్యాబ్‌ ఎం10 హెచ్‌డీ ట్యాబ్లెట్‌ స్క్రీన్‌ సైజ్‌ 10 అంగుళాలు. 1280×800 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌. 2 GHz క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 429 క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌తో ఆండ్రాయిడ్‌ Pie ఆపరేటింగ్ సిస్టమ్‌ ద్వారా పనిచేస్తుంది. 2జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ మెమొరీని మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. 4,850 ఎంఏహెచ్‌ బ్యాటరీతో పని చేస్తుంది. దీని ధర దాదాపు రూ. 14,999. 4జీ సపోర్ట్‌ చేయని ట్యాబ్‌ ధర రూ.10,499లకు దొరుకుతుంది. 


అల్కాటెల్‌ 3T 10

అల్కాటెల్‌ తన కొత్త ట్యాబ్లెట్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. అల్కాటెల్‌ 3T 10 పేరుతో మార్కెట్‌లోకి వచ్చింది. 10 అంగుళాల డిస్‌ప్లే కలిగిన ట్యాబ్‌ 800×1280 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌తో పనిచేస్తుంది. 1.28 GHz క్వాడ్‌కోర్‌ మీడియాటెక్‌ MT 8765B ప్రాసెసర్‌ను వినియోగించారు. 2జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజీతో 128 జీబీ ఎక్స్‌పాండబుల్‌ మెమొరీ ఉంది. 4జీ సపోర్ట్‌తో అల్కాటెల్‌ ట్యాబ్‌ ఆండ్రాయిడ్‌ 9.0 Pie, 4080 ఎంఏహెచ్‌ బ్యాటరీతో పని చేస్తుంది. ట్యాబ్‌ రూ.12,900లలో దొరుకుతుంది.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని