ఫొటోతోనే వీడియో..

షేక్‌స్పియర్‌ స్వగతాన్ని మోనాలిసా పాట రూపంలో పాడితే? అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇలాంటి అద్భుతాలు ఎన్నయినా చేయొచ్చు

Updated : 13 Mar 2024 04:17 IST

షేక్‌స్పియర్‌ స్వగతాన్ని మోనాలిసా పాట రూపంలో పాడితే? అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇలాంటి అద్భుతాలు ఎన్నయినా చేయొచ్చు. చైనాలోని అలీబాబా సంస్థకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటెలిజెంట్‌ కంప్యూటింగ్‌ ఇంజినీర్లు దీన్నే సుసాధ్యం చేశారు. ఎవరి ముఖం ఫొటోనైనా వీడియోగా మార్చి.. ఆడియో ట్రాక్‌తో అనుసంధానం చేసే యాప్‌ను రూపొందించారు. దీని పేరు ఎమోటే పోర్‌ట్రెయిట్‌ అలైవ్‌ (ఎమో). ఇది ఆయా సమయాల్లో వస్తువులు ఎలా విస్తరిస్తాయో, ముడుచుకుంటాయో వర్ణించే గణిత నమూనాల (డిఫ్యూజన్‌ మోడళ్లు) జనరేటివ్‌ సామర్థ్యాలతో పనిచేస్తుంది. ఇది ఇమేజ్‌, ఆడియో క్లిప్‌ ఇన్‌పుట్‌ను ఎంచుకున్న పాత్ర తల వీడియోతో అనుసంధానం చేస్తుంది. అదీ చాలా తేలికగా. ఇది సంప్రదాయ పద్ధతుల మాదిరిగా 3డీ తల చిత్రాల మీద ఆధారపడదు. నేరుగా ఆడియో నుంచి వీడియోకు మార్చే టెక్నాలజీతో కూడి ఉంటుంది. శబ్ద తరంగాలను వీడియో ఫ్రేములుగా మారుస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని