వెబ్‌ పేజీలు త్వరగా లోడ్‌ కావాలంటే?

అత్యవసరంగా ఫోన్‌లో ఏదో వెబ్‌సైట్‌ను క్లిక్‌ చేస్తాం. కానీ అది ఎంతకీ ఓపెన్‌ కాకపోతే? బాగా చికాకు కలుగుతుంది. గుండ్రంగా తిరుగుతూ ఉండే చక్రాన్ని చూడటం ఎవరికైనా ఇబ్బందే.

Published : 05 Jun 2024 00:06 IST

అత్యవసరంగా ఫోన్‌లో ఏదో వెబ్‌సైట్‌ను క్లిక్‌ చేస్తాం. కానీ అది ఎంతకీ ఓపెన్‌ కాకపోతే? బాగా చికాకు కలుగుతుంది. గుండ్రంగా తిరుగుతూ ఉండే చక్రాన్ని చూడటం ఎవరికైనా ఇబ్బందే. అయితే గూగుల్‌ క్రోమ్‌ వాడేవారికి అలాంటి ఇబ్బందేమీ ఉండదు. ఇందులో వెబ్‌ పేజీలు త్వరగా లోడ్‌ కావటానికి ఓ చిట్కా ఉంది మరి. ఇది మనం క్లిక్‌ చేయకముందే తర్వాత చూడాలనుకునే వెబ్‌పేజీలను బ్యాక్‌గ్రౌండ్‌లో ముందుగానే లోడ్‌ చేసి ఉంచుతుంది. అందువల్ల క్లిక్‌ చేయగానే ఓపెన్‌ అవుతుంది. తెలివైన ఆల్గోరిథమ్‌ల సాయంతో మున్ముందు మనం చూడబోయే వెబ్‌ పేజీలను క్రోమ్‌ అంచనా వేస్తుంది. బ్రౌజింగ్‌ హిస్టరీ, సెర్చ్‌ చేసే తీరు ఆధారంగా వీటిని ఊహిస్తుంది. మనం బ్రౌజింగ్‌ చేస్తున్నప్పుడు ఈ పేజీలు వెనకాల అదృశ్యంగా ఉంటాయి. మరి మొబైల్‌ ఫోన్‌లో ఈ ప్రిలోడింగ్‌ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకోవటమెలా?

  • క్రోమ్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి పైన కుడి మూలన నిలువు మూడు చుక్కల మీద తాకాలి. 
  • డ్రాప్‌ డౌన్‌ మెనూలో సెటింగ్స్‌ మీద తాకాలి.
  • అనంతరం ప్రైవసీ అండ్‌ సెక్యూరిటీ విభాగంలోకి వెళ్లాలి. ఇందులో ప్రిలోడ్‌ పేజెస్‌ మీద క్లిక్‌ చేసి స్టాండర్డ్‌ ప్రిలోడింగ్‌ లేదా ఎక్స్‌టెండెడ్‌ ప్రిలోడింగ్‌ ఆప్షన్‌ను సెట్‌ చేసుకోవాలి. స్టాండర్డ్‌ మోడ్‌ మన బ్రౌజింగ్‌ హిస్టరీ, కుకీస్‌ ఆధారంగా తర్వాత చూడబోయే పేజీలను అంచనా వేస్తుంది. ఇక ఎక్స్‌టెండెడ్‌ మోడ్‌ అయితే మనం ఇంతకుముందు చూడని పేజీలనూ ప్రిలోడ్‌ చేసి పెడుతుంది. ఇది ఎక్కువ డేటాను తీసుకుంటుందని మరవరాదు.

పీసీలోనైతే..

  • క్రోమ్‌లో పైన కుడి మూలన మూడు చుక్కల మీద తాకి మెయిన్‌ మెనూలోకి వెళ్లాలి.
  • ఇందులో సెటింగ్స్‌ను ఎంచుకోవాలి. సెటింగ్స్‌ పేజీలో ఎడమ వైపును ఉండే పర్‌ఫార్మెన్స్‌ మీద క్లిక్‌ చేయాలి. 
  • స్పీడ్‌ విభాగం కింద ప్రిలోడ్‌ పేజెస్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని