సైన్‌ఇన్‌ లేకుండానే ఛాట్‌జీపీటీ

ఛాట్‌జీపీటీని వాడుకోవాలంటే ముందు సైన్‌ఇన్‌ కావాల్సి ఉంటుంది. పాస్‌వర్డ్‌ను మరచిపోవటం వంటి సందర్భాల్లో ఇది కష్టంగా అనిపిస్తుంటుంది.

Published : 10 Apr 2024 00:44 IST

ఛాట్‌జీపీటీని వాడుకోవాలంటే ముందు సైన్‌ఇన్‌ కావాల్సి ఉంటుంది. పాస్‌వర్డ్‌ను మరచిపోవటం వంటి సందర్భాల్లో ఇది కష్టంగా అనిపిస్తుంటుంది. ఎక్కువ సమయం పడుతుంది. ఇకపై అలాంటి ఇబ్బందేమీ ఉండదు. సైన్‌ఇన్‌ కాకపోయినా ఉచితంగా ఛాట్‌జీపీటీని వాడుకోవచ్చు. ఓపెన్‌ఏఐ సంస్థ ఇటీవలే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకూ ఛాట్‌జీపీటీని ఉపయోగించుకోవాలంటే ఈమెయిల్‌ చిరునామా, ఫోన్‌ నంబరుతో లేదా గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌ ఖాతాలతో ఓపెన్‌ఏఐ అకౌంటుకు నమోదు చేసుకోవాల్సి వచ్చేది. వీటితో అవసరం లేకుండా ఉచిత వర్షన్‌ను వాడుకోవటానికి ఓపెన్‌ఏఐ అవకాశం కల్పించింది. కృత్రిమ మేధ (ఏఐ) నుంచి త్వరగా సమాధానాలు పొందాలని అనుకునేవారికిది బాగా అనువుగా ఉంటుంది. కొత్త పరికరంతో ఛాట్‌జీపీటీని వాడుకోవాలని అనుకున్నప్పుడూ ఉపయోగపడుతుంది. అయితే జీపీటీ-, డాల్‌-ఇ వంటి ఇతర ఫీచర్లు వాడుకోవాలంటే మాత్రం ఖాతా ఉండాల్సిందే. ఉచిత వర్షన్‌ను వెబ్‌ ద్వారా ఉపయోగించుకోవాలంటే..

  •  ముందు బ్రౌజర్‌ను ఓపెన్‌ చేసి, chat.openai.com లోకి వెళ్లాలి. కింద కనిపించే కన్వర్జేషన్‌ బాక్సులో ప్రాంప్ట్‌ను  టైప్‌ చేసి సెండ్‌ బటన్‌ను నొక్కితే చాలు. లేదూ కీబోర్డులో ఎంటర్‌ మీటనైనా నొక్కొచ్చు.
  •  ప్రాంప్ట్‌కు సంబంధించిన వివరాలన్నీ కనిపిస్తాయి. ఇలా వీలైనంత సేపు కన్వర్జేషన్‌ను కొనసాగించొచ్చు.
  • గుర్తించాల్సిన విషయం ఏంçËంటే- ఈ ఉచిత వర్షన్‌లో ఛాట్స్‌ సేవ్‌ కావు. కన్వర్జేషన్‌ కాపీని పొందాలంటే ఖాతాతో అనుసంధానం కావాల్సి ఉంటుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని