వైఫై పాస్‌వర్డ్‌ మరిచారా?

ఇంటికి వచ్చిన అతిథులో, పరిచయం ఉన్నవారో వైఫై పాస్‌వర్డ్‌ అడుగుతుంటారు. చాలాసార్లు అదేంటో గుర్తుకురాదు. మరెలా? చేతిలో ఫోన్‌ ఉంటే ఇట్టే తెలుసుకోవచ్చు. ఐఫోన్‌ వాడేవారైతే- సెటింగ్స్‌ ద్వారా వైఫై విభాగంలోకి వెళ్లాలి.

Updated : 10 Apr 2024 04:14 IST

ఇంటికి వచ్చిన అతిథులో, పరిచయం ఉన్నవారో వైఫై పాస్‌వర్డ్‌ అడుగుతుంటారు. చాలాసార్లు అదేంటో గుర్తుకురాదు. మరెలా? చేతిలో ఫోన్‌ ఉంటే ఇట్టే తెలుసుకోవచ్చు. ఐఫోన్‌ వాడేవారైతే- సెటింగ్స్‌ ద్వారా వైఫై విభాగంలోకి వెళ్లాలి. నెట్‌వర్క్‌ను ఎంచుకోవాలి. పాస్‌వర్డ్‌ బాక్సు మీద తాకితే అదేంటో కనిపిస్తుంది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వాడేవారైతే- సెటింగ్స్‌లోకి వెళ్లాలి. నెట్‌వర్క్‌ పక్కనుండే చక్రం గుర్తును తాకి, షేర్‌ను ఎంచుకోవాలి. క్యూఆర్‌ కోడ్‌ కింద పాస్‌వర్డ్‌ ప్రత్యక్షమవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని