ఆడియో ఎమోజీ!

ఎమోజీలనగానే బుల్లి బుల్లి బొమ్మలే గుర్తుకొస్తాయి. మరి ఆడియో రూపంలో ఉంటే? గూగుల్‌ ఫోన్‌ వీటిని కొత్తగా పరిచయం చేసింది.

Published : 08 May 2024 00:16 IST

ఎమోజీలనగానే బుల్లి బుల్లి బొమ్మలే గుర్తుకొస్తాయి. మరి ఆడియో రూపంలో ఉంటే? గూగుల్‌ ఫోన్‌ వీటిని కొత్తగా పరిచయం చేసింది. దీంతో ఆండ్రాయిడ్‌ ఫోన్లు వాడేవారికి త్వరలోనే ఆరు ఆడియో ఎమోజీలు (స్యాడ్‌, అప్లాజ్‌, సెలబ్రేషన్‌, లాఫ్‌, డ్రమ్‌రోల్‌, పూప్‌) అందుబాటులోకి రానున్నాయి. ఫోన్‌ కాల్స్‌కు వినోదాత్మక సౌండ్‌ ఎఫెక్ట్స్‌ను జోడించటం వీటి ప్రత్యేకత. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ పరీక్షల దశలోనే ఉంది. అందువల్ల కొందరికే అందుబాటులో ఉంటుంది. ఈ ఆడియో ఎమోజీలను ప్లే చేసినప్పుడు తెర మీద యానిమేషన్‌ కనిపిస్తుంది. కాల్‌ చేసేవారు, అందుకునేవారు ఇద్దరికీ ఈ యానిమేషన్‌ కనిపిస్తుందో లేదో ఇంకా స్పష్టంగా తెలియదు కానీ ఆడియో మాత్రం రెండు వైపులా వినిస్తుంది.

ఎలా వాడుకోవాలి?

  •  ముందు గూగుల్‌ ఫోన్‌ బీటా ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకోవాలి.
  • బీటా ప్రోగ్రామ్‌లో నమోదయ్యాక కాల్‌ చేస్తున్నప్పుడు మూడుచుక్కల ఓవర్‌ ఫ్లో మెనూలో గానీ నేరుగా తెర మీద గానీ ఆడియో ఇమేజ్‌ బటన్‌ ప్రత్యక్షమవుతుంది.
  •  ఈ బటన్‌ మీద తాకి ఇష్టమైన ఎమోజీని ఎంచుకోవాలి. అప్పుడు స్వల్ప వ్యవధి యానిమేషన్‌ ప్లే అవుతుంది. కాల్‌ చేసినవారికి, అందుకున్నవారికి సౌండ్‌ ఎఫెక్ట్‌ రింగ్‌ అవుతుంది. పోస్టులకు బొమ్మలతో ప్రతిస్పందన తెలియజేసినట్టుగానే వీటితో శబ్దాలతో మనసులోని భావాలను ప్రకటించు కోవచ్చు. భలే ఫీచర్‌ కదా.

- ఆడియో ఎమోజీ అనేది వినోదం కోసం ఉద్దేశించిందేనని గుర్తుంచుకోవాలి. అయినప్పటికీ మిశ్రమ ప్రతిస్పందనలు ఎదురవ్వచ్చు. ఇష్టమైనట్టుగా శబ్దాలను మార్చుకోవటం, కొత్త ఎమోజీలను జత చేయటం కుదరదు కూడా. ఒకవేళ వద్దనుకుంటే గూగుల్‌ ఫోన్‌ సెటింగ్స్‌ నుంచి ఆడియో ఎమోజీలను డిసేబుల్‌ చేసుకునే సదుపాయమూ ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు