ఎక్స్‌లో కమ్యూనిటీ నోట్స్‌

ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో ఎక్స్‌ (ట్విటర్‌) మనదేశంలో కమ్యూనిటీ నోట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌కు కంట్రిబ్యూట్‌ చేయటానికి కొత్తవారికీ ఆహ్వానం పలికింది

Published : 10 Apr 2024 00:24 IST

ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో ఎక్స్‌ (ట్విటర్‌) మనదేశంలో కమ్యూనిటీ నోట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌కు కంట్రిబ్యూట్‌ చేయటానికి కొత్తవారికీ ఆహ్వానం పలికింది. కమ్యూనిటీ నోట్స్‌ అనేది యూజర్‌ ఆధారిత ఫ్యాక్ట్‌ చెకింగ్‌ ప్రోగ్రామ్‌. వివిధ దృక్కోణాలు గలవారికిది బాగా తోడ్పడుతుంది. తప్పుదారి పట్టించే అవకాశం గల పోస్టులకు సందర్భాలను జోడించటానికిది వీలు కల్పిస్తుంది. ఇలా సరైన సమాచారం ప్రసారం కావటానికి దోహదం చేస్తుంది. కంట్రిబ్యూటర్లు ఏ పోస్టు మీదైనా నోట్స్‌ను పెట్టొచ్చు. భిన్న రంగాలకు చెందిన కంట్రిబ్యూటర్లు ఆ నోట్‌ ఉపయోగపడుతుందని రేట్‌ ఇచ్చినట్టయితే ఆయా పోస్టులు అందరికీ కనిపిస్తాయి. ఎక్స్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే తప్ప కమ్యూనిటీ నోట్‌తో కూడిన పోస్టును లేబుల్‌ చేయటానికి, తొలగించటానికి వీలుండదు. కమ్యూనిటీ నోట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా 69 దేశాల కంట్రిబ్యూటర్లు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని