వాట్సప్‌ ఛాట్‌ ఫిల్టర్‌

వాట్సప్‌ గత కొన్నిరోజులుగా గోప్యతను కాపాడుతూనే ఎన్నో వినూత్న ఫీచర్లు పరిచయం చేస్తోంది. ఎక్కువ మందికి మెటా ఏఐని అందుబాటులోకి తేవటం దగ్గరి నుంచి యాప్‌ నుంచే బస్‌ టికెట్లు కొనుక్కోవటానికి వీలు కల్పించటం వరకూ ఎన్నో సదుపాయాలను ఆరంభించింది.

Published : 24 Apr 2024 00:13 IST

వాట్సప్‌ గత కొన్నిరోజులుగా గోప్యతను కాపాడుతూనే ఎన్నో వినూత్న ఫీచర్లు పరిచయం చేస్తోంది. ఎక్కువ మందికి మెటా ఏఐని అందుబాటులోకి తేవటం దగ్గరి నుంచి యాప్‌ నుంచే బస్‌ టికెట్లు కొనుక్కోవటానికి వీలు కల్పించటం వరకూ ఎన్నో సదుపాయాలను ఆరంభించింది. తాజాగా మెసేజ్‌లను తేలికగా వర్గీకరించుకోవటానికీ ఛాట్‌ ఫిల్టర్స్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో ఇన్‌బాక్స్‌లో కింది వరకూ స్క్రోల్‌ చేయాల్సిన అవసరం లేకుండా అవసరమైన ఛాట్‌ను తేలికగా కనుక్కోవచ్చు. చాట్స్‌ క్రమబద్ధంగా వర్గీకరించుకోవటానికి, ముఖ్యమైన ఛాట్స్‌ను గుర్తించటానికి, ఆయా మెసేజ్‌లను తేలికగా చూసుకోవటానికిది ఉపయోగపడుతుంది. ఛాట్‌ ఫిల్టర్స్‌లో భాగంగా ఆల్‌, అన్‌రీడ్‌, గ్రూప్స్‌ అనే మూడు విభాగాలుంటాయి. ఆల్‌ ఫిల్టరేమో డిఫాల్ట్‌గా అన్ని ఛాట్స్‌ను చూపిస్తుంది. అన్‌రీడ్‌లోనైతే జవాబులు ఇవ్వని లేదా అన్‌రీడ్‌గా మార్కు చేసుకున్న ఛాట్స్‌ ఉంటాయి. గ్రూప్స్‌ ఫిల్టర్‌లో అన్ని గ్రూప్‌ ఛాట్స్‌ కనిపిస్తాయి. ఈ ఫీచర్‌ ప్రస్తుతం కొందరికి అందుబాటులోకి వచ్చింది. తర్వలో ఎక్కువ మందికి విస్తరించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని