సైబర్‌ నేరాలకు చక్షు కళ్లెం

మోసపూరిత కాల్స్‌, మెసేజ్‌ల వంటి సైబర్‌ నేరాలను అరికట్టటానికి టెలికం విభాగం కొత్త పోర్టల్‌ను పరిచయం చేసింది. సంచార్‌ సాథీ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చిన దీని పేరు చక్షు.

Updated : 10 Apr 2024 04:16 IST

మోసపూరిత కాల్స్‌, మెసేజ్‌ల వంటి సైబర్‌ నేరాలను అరికట్టటానికి టెలికం విభాగం కొత్త పోర్టల్‌ను పరిచయం చేసింది. సంచార్‌ సాథీ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చిన దీని పేరు చక్షు. నకిలీ కస్టమర్‌ కేర్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాలు, పేమెంట్‌ వాలెట్స్‌, గ్యాస్‌ కనెక్షన్స్‌, ప్రభుత్వ అధికారులుగా నమ్మించే కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌, వాట్సప్‌ మెసేజెస్‌ రూపంలో వచ్చే ఎలాంటి అనుమానాస్పద కమ్యూనికేషన్ల గురించి అయినా దీని ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. సంచార్‌ సాథీ వెబ్‌సైట్‌లో చక్షు అందుబాటులో ఉంటుంది.

* ముందు  sancharsaathi.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. కిందికి స్క్రోల్‌ చేస్తే సిటిజన్‌ సెంట్రిక్‌ సర్వీసెస్‌ విభాగం కనిపిస్తుంది.

* ఇందులో చక్షు ఆప్షన్‌ను ఎంచుకొని నకిలీ కాల్స్‌, మెసేజ్‌ల వారీగా మోసాలను రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

* డ్రాప్‌ డౌన్‌ మెనూలోంచి ఎలాంటి మోసమో ఎంచుకొని, కాల్‌ స్క్రీన్‌ షాట్‌ను అటాచ్‌ చేయాలి.

* వచ్చిన ఫోన్‌ నంబరును ఎంటర్‌ చేయాలి. కాల్‌ వచ్చిన తేదీ, సమయాన్ని వివరించాలి.

* చివరికి వ్యక్తిగత వివరాలు తెలియజేసి ఓటీపీతో ధ్రువీకరించుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని