చిటికెలో వెబ్‌సైట్‌

కొద్ది నిమిషాల్లో వెబ్‌సైట్‌ను సృష్టించుకోవాలని అనుకుంటున్నారా? అయితే విక్స్‌ ఏఐ వెబ్‌సైట్‌ బిల్డర్‌ సాయం తీసుకోవచ్చు. ఇది ఏఐ ఛాట్‌బాట్‌ సాయంతో సెకండ్లలోనే వెబ్‌సైట్‌ను తయారుచేస్తుంది మరి.

Updated : 13 Mar 2024 04:18 IST

కొద్ది నిమిషాల్లో వెబ్‌సైట్‌ను సృష్టించుకోవాలని అనుకుంటున్నారా? అయితే విక్స్‌ ఏఐ వెబ్‌సైట్‌ బిల్డర్‌ సాయం తీసుకోవచ్చు. ఇది ఏఐ ఛాట్‌బాట్‌ సాయంతో సెకండ్లలోనే వెబ్‌సైట్‌ను తయారుచేస్తుంది మరి. కోడ్‌తో పనిలేకుండా తేలికగా వెబ్‌సైట్‌ తయారీ, బిజినెస్‌ టూల్స్‌ను రూపొందించటంలో విక్స్‌ సంస్థకు మంచి పేరుంది. ఇప్పుడు ఏఐ సాయంతోనూ మరింత మెరుగుదిద్దుకుంది. కొన్ని మామూలు ప్రశ్నలకు సమాధానం ఇస్తే చాలు, కోరుకున్న విధంగా వెబ్‌సైట్‌ను రూపొందిస్తుంది. ఇందుకోసం ముందుగా విక్స్‌లో అకౌంట్‌ను ఓపెన్‌ చేయాలి. అనంతరం ‘క్రియేట్‌ విత్‌ ఏఐ’ బటన్‌ మీద నొక్కాలి. ఏఐ ఛాట్‌బాట్‌ కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. వీటికి సమాధానం ఇస్తే చాలు. వెబ్‌సైట్‌ను సృష్టిస్తుంది. అవసరాన్ని బట్టి థీమ్‌, లేఅవుట్‌ వంటివి ఎడిట్‌ చేసుకునే సదుపాయమూ ఉంటుంది. ఉచితంగానే దీన్ని వాడుకోవచ్చు. మరిన్ని ఫీచర్లు కావాలంటే నెలకు రూ.199 చందా కట్టాల్సి ఉంటుంది. బిజినెస్‌ అవసరాలకైతే చందా ఇంకాస్త ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని