కేసీఆర్‌ అవినీతిపై విచారణ జరిపించాలి: పొన్నాల

ప్రధానమంత్రి దగ్గర కేసీఆర్‌ అవినీతిపై ఆధారాలుంటే రాష్ట్రపతి పాలన విధించి ఆయనపై విచారణ జరిపించాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్‌ చేశారు. ఆయన శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ అవినీతిపై మాట్లాడిన

Published : 28 May 2022 05:45 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి దగ్గర కేసీఆర్‌ అవినీతిపై ఆధారాలుంటే రాష్ట్రపతి పాలన విధించి ఆయనపై విచారణ జరిపించాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్‌ చేశారు. ఆయన శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ అవినీతిపై మాట్లాడిన మోదీ మాటలకే పరిమితం కాకుండా ఆ అవినీతిని వెలికి తీసి చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. దర్యాప్తునకు ఆదేశించే అధికారం ఉండి కూడా విమర్శలతో సరిపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ సమస్యలపై మాట్లాడకుండా నరేంద్రమోదీ కేవలం రాజకీయ అంశాలపై మాట్లాడటం దుర్మార్గమన్నారు.  ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటనలో రాజకీయ విమర్శలకే ప్రాధాన్యమిచ్చారని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు షబ్బీర్‌ అలీ ఓ ప్రకటనలో విమర్శించారు. నరేంద్రమోదీ భాజపాకు ప్రధానమంత్రా?, తెలంగాణ సహా మొత్తం దేశానికి ప్రధానా? అని ప్రశ్నించారు. తెలంగాణ అవసరాలపై మెమోరాండం సమర్పించే అవకాశాన్ని ఉపయోగించుకోకుండా కేసీఆర్‌ ప్రధాని పర్యటన సమయంలో పక్క రాష్ట్ర పర్యటనకు వెళ్లడం సరైంది కాదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని