ఓటరుగా సీఎం రేవంత్‌రెడ్డి పేరు

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎక్స్‌ అఫీషియో హోదాలో ఓటరుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరు నమోదైంది.

Published : 14 Mar 2024 04:38 IST

కొడంగల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎక్స్‌ అఫీషియో హోదాలో ఓటరుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరు నమోదైంది. బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు తుది జాబితాను వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ తహసీల్దారు విజయకుమార్‌ విడుదల చేశారు. కొడంగల్‌ పురపాలిక పరిధి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి పేరు నమోదు చేసుకున్నట్లుగా అందులో వెల్లడించారు. ఈ నెల 28న జరిగే ఉప ఎన్నిక కోసం మండల పరిషత్‌ కార్యాలయంలో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని