భువనగిరి గురుకులంలో తాగునీరు కలుషితం.. పప్పు నాసిరకం

యాదాద్రి జిల్లా భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో వినియోగిస్తున్న తాగునీరు కలుషితమైందని, పప్పు నాసిరకమని పరీక్షల్లో తేలింది.

Published : 23 Apr 2024 03:58 IST

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: యాదాద్రి జిల్లా భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో వినియోగిస్తున్న తాగునీరు కలుషితమైందని, పప్పు నాసిరకమని పరీక్షల్లో తేలింది. ఇక్కడ కలుషితాహారంతో ఓ విద్యార్థి మృతిచెందడంతో పాటు, మరికొంత మంది తీవ్ర అస్వస్థతకు గురైన నేపథ్యంలో  జిల్లా ఆహార భద్రత అధికారి స్వాతి ఆధ్వర్యంలో 18 రకాల వస్తువుల నమూనాలు సేకరించి పరీక్ష కోసం పంపించారు. వాటిలో 15 వస్తువుల ఫలితాలు రాగా.. నీరు కలుషితంగా ఉందని, పప్పు నాసిరకంగా ఉందని నివేదిక వచ్చినట్లు స్వాతి తెలిపారు. ఈ గురుకులంలో సోమవారం జాతీయ ఎస్సీ కమిషన్‌ బృందం పర్యటిస్తుందని ఇటీవల వార్తలు వచ్చినా.. సంబంధిత అధికారులు ఎవరూ రాలేదు. దీనిపై తమకు సమాచారం లేదని జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి జైపాల్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని