కొత్త వంగడాలను రూపొందించాలి

వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై  వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ వెంకటరమణ పిలుపునిచ్చారు.

Published : 23 Apr 2024 04:46 IST

వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌

ఈనాడు, హైదరాబాద్‌: వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై  వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ వెంకటరమణ పిలుపునిచ్చారు. 2024-25లో సాగు కార్యాచరణ ప్రణాళికపై సోమవారం రాజేంద్రనగర్‌లో విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా వెంకటరమణ, పరిశోధన సంచాలకుడు రఘురామిరెడ్డిలు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, రైతుల లాభదాయకత, ఉత్పాదకతల పెంపుదలకు పరిశోధనలు జరగాలన్నారు. తక్కువ నీటి వనరులను వినియోగించే సాగు విధానాలను ప్రోత్సహించాలన్నారు. తమ పరిశోధనలు, ప్రాజెక్టులకు సంబంధించిన ప్రచురణల పేటెంట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వారు సూచించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ప్రచురించిన నాలుగు పుస్తకాలను విడుదల చేశారు. ఈ సదస్సులో విశ్వవిద్యాలయ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని