సాగర్‌ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది.

Published : 24 Apr 2024 03:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. ఈ మేరకు ఏపీ జల వనరుల శాఖ ఈఎన్సీకి బోర్డు సభ్యుడు బీఆర్‌ శంఖ్వా లేఖ రాశారు. ఈ నెల 12న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లుగా ఆ రోజు నుంచి 23వ తేదీ రాత్రి 8 గంటల వరకు కుడి కాలువ ద్వారా ఏపీకి 5.50 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు పేర్కొంది.

శివ్‌నందన్‌, వెదిరె శ్రీరాంలతో రాహుల్‌ బొజ్జా భేటీ

కృష్ణా నది యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ శివ్‌నందన్‌ కుమార్‌తో నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బోర్డుకు ఇవ్వాల్సిన బడ్జెట్‌ను వెంటనే కేటాయించాలని ఛైర్మన్‌ కోరినట్లు తెలిసింది. హైదరాబాద్‌కు వచ్చిన నదుల అనుసంధాన ప్రాజెక్టు టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌ వెదిరె శ్రీరాంతోనూ రాహుల్‌ బొజ్జా భేటీ అయ్యారు. గోదావరిపై సమ్మక్క బ్యారేజీ, సీతారామా ఎత్తిపోతల పథకం, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుల అనుమతులు వేగంగా ఇవ్వాలని రాహుల్‌ కోరినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని