వేసవిలో ఉద్యానపంటలపై రైతులకు అవగాహన

వేసవిలో ఉద్యానపంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానవన సంచాలకుడు కె.అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన జిల్లా అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు.

Published : 06 May 2024 03:09 IST

సంచాలకుడి ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: వేసవిలో ఉద్యానపంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానవన సంచాలకుడు కె.అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన జిల్లా అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం, భూగర్భజలాలు తగ్గడం, బోరు బావుల్లో నీరు ఇంకిపోవడంతో ఉద్యాన పంటల సాగులో ఎదురయ్యే సమస్యలను అధిగమించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సూచించిన యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించాలని సూచించారు. జూన్‌ నెల వరకు జిల్లాల్లో ఉద్యాన పంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. వేసవిలో నీటి ఎద్దడి ఉన్న పామాయిల్‌ తోటల్లో తేమ ఉండేటట్లు చూసుకోవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని